13 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్-అన్నా కొణిదెల
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ సోమవారం రాత్రి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా, పిల్లల శ్రేయస్సు కోరే బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని వెల్లడించారు. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు.







