రివైజింగ్ కమిటీకి భోగి!
శర్వానంద్(Sharwanand), సంపత్ నంది(Samapth Nandi) కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా భోగి(Bhogi) రిలీజ్ కు బ్రేక్ పడింది. 1960ల నాటి తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా, తనదైన రస్టిక్ మేకింగ్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పల్లెటూరి జీవనశైలి, అప్పటి సంస్కృతి, పండుగల వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాంగ్స్ ను రూపొందించడం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే సినిమాలోని కొన్ని సీన్స్ లో ఉన్న తీవ్రమైన హింస, రక్తపాతం కారణంగా సెన్సార్ బోర్డు ఈ సినిమాను రివైజింగ్ కమిటీ పరిశీలనకు పంపినట్లు సమాచారం.
రివైజింగ్ కమిటీ సినిమా వీక్షించి ఫైనల్ డెసిషన్ వెల్లడించాల్సి ఉండటంతో రిలీజ్ విషయంలో కొంత జాప్యం తప్పేలా లేదు. ఈ ప్రక్రియకు మరికొంత టైమ్ పట్టే అవకాశం ఉన్నప్పటికీ, వీలైనంత త్వరగా పర్మిషన్స్ పొందేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అడ్డంకులు తొలగిన వెంటనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించనున్నారు. 1960ల నాటి గ్రామీణ యువకుడిగా, తన అక్కాచెల్లెళ్ల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మనసున్న వ్యక్తిగా ఆయన క్యారెక్టర్ సాగనుంది. ఈ క్యారెక్టర్ కోసం శర్వానంద్ చేసిన మేకోవర్, యాక్టింగ్ కు ఇప్పటికే మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
కె.కె. రాధామోహన్(KK Radhamohan) భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తుండగా, సంపత్ నంది(sampath nandi) తనదైన శైలిలో మాస్ యాక్షన్‌తో కూడిన బలమైన కథను తెరకెక్కిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) హీరోయిన్ గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) మ్యూజిక్ అందిస్తున్నారు. చంద్రబోస్(chandrabose) రాసిన సాంగ్స్ పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. సెన్సార్ ప్రక్రియలో ఎదురైన ఆలస్యం కారణంగా భోగి రిలీజ్ వాయిదా పడినా, శర్వానంద్ రగ్గడ్ లుక్, తెలంగాణ గ్రామీణ నేపథ్యం, భారీ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.







