ఆలస్యాలకు చెక్.. ఫౌజీ షూటింగ్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) తన ఇటలీ వెకేషన్‌ను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. దాదాపు రెండు వారాల పాటు విదేశాల్లో విహారయాత్ర చేసిన ఆయన, తాజాగా తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా హను రాఘవపూడి(Hanu raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఫౌజీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో నేటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో భాగంగా ప్రభాస్, ఇమాన్వీ(Imanvi)పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ వివాహ వేడుకకు సంబంధించిన సెట్‌ను రెడీ చేశారు.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని చిత్ర బృందం పట్టుదలతో ఉంది. ప్రభాస్ సైతం తన ఇతర ప్రాజెక్టులకు కొంత బ్రేక్ ఇచ్చి ఫౌజీ(Fauzi)కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా తనకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసి, నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఫౌజీ షూటింగ్ మరింత వేగవంతం కానుంది.
మైత్రీ మూవీ మేకర్స్(Mythi movie makers) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్(Vishal chandrasekhar) మ్యూజిక్ అందిస్తున్నారు. హను రాఘవపూడి తనదైన శైలిలో ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా రూపొందిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఫౌజీ నిలవనుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చి 19, 2027గా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తి చేసి, ఆడియన్స్ ముందుకు రావాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు.







