షూటింగ్ పూర్తి.. పెట్టుబడి రికవరీ.. నాని మాస్టర్ ప్లాన్!
నేచురల్ స్టార్ నాని(nani) నిర్మాణంలో యంగ్ హీరో నితిన్(nithin) నటిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ అలియాస్ రుక్మిణి(Alias rukmini) షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 3న అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్‌ను కేవలం మూడు నెలల వ్యవధిలోనే మేకర్స్ ముగించడం విశేషం. ముందస్తు ప్లానింగ్ తో షెడ్యూల్స్ రూపొందించుకోవడంతో ఎలాంటి జాప్యం లేకుండా షూటింగ్ ను పూర్తి చేశారు. నితిన్ సైతం ఈ సినిమా కోసం స్పెషల్ గా డేట్స్ కేటాయించి, గ్యాప్స్ లేకుండా షూటింగ్లో పాల్గొని అనుకున్న టైమ్ కు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 4న ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మరోవైపు, సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకం ద్వారా నిర్మాత నాని పెట్టుబడిని పూర్తిగా రికవరీ చేసినట్లు సమాచారం. నాని బ్రాండ్ ఇమేజ్, నితిన్‌పై ఉన్న మార్కెట్ నమ్మకం ఈ డీల్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్‌కు అలియాస్ రుక్మిణి ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. మురళీకాంత్ దేవసోత్(muralikanth devasoth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆఫియా సయ్యద్ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్(Vijay bulganin) మ్యూజిక్ ను అందిస్తున్నారు.
యునానిమస్ ప్రొడక్షన్స్(Unanimous productions) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నాని సోదరి దీప్తి (Deepthi) నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించారు. సాధారణంగా సినిమా నిర్మాణంలో షెడ్యూల్స్ లేట్ కావడం, బడ్జెట్ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే పక్కా ప్లానింగ్, సమన్వయంతో నిర్ణీత కాలంలోనే షూటింగ్ పూర్తి చేయవచ్చని అలియాస్ రుక్మిణి ప్రూవ్ చేసింది. నిర్మాతలకు ఆదర్శంగా నిలిచేలా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దడం విశేషం.







