సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ లాక్.. ఈసారి కొత్త డైరెక్టర్‌తో!
టిల్లు(Tillu) ఫ్రాంచైజీతో వరుస సక్సెస్‌లను అందుకుని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టిల్లు సిరీస్ వెలుపల వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో కథల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాజెక్టులను పక్కన పెట్టిన సిద్ధు, ప్రస్తుతం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(Agent sai srinivasa athreya) ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే(Swaroop RSJ) దర్శకత్వంలో రూపొందుతున్న లంగిమాన్(Langimaan) సినిమాలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్‌ను 2027 వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సిద్ధు జొన్నలగడ్డ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్(Sukumar writings), బన్నీ వాస్(Bunny vaas) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. బాబీ(bobby) అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ 11 నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
మొత్తం మూడు భారీ షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాతలు ప్లాన్స్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అఫీషియల్ గా వెల్లడించనున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్న సిద్ధు, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. టిల్లు ఇమేజ్‌కు భిన్నంగా మరో కొత్త యాంగిల్ లో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధు చేస్తున్న ఈ ప్రయత్నం ఆయన కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.







