నెట్‌ఫ్లిక్స్‌తో ENE రిపీట్ భారీ డీల్
యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నగరానికి ఏమైంది(Ee nagaraniki emaindhi) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా ENE రిపీట్. తరుణ్ భాస్కర్(Tharun bhaskar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. విశ్వక్ సేన్(Viswaksen), అభినవ్ గోమఠం(Abhinav Gomatam), వెంకటేష్ కాకుమాను(Venkatesh Kakumanu), శ్రీనాథ్ మాగంటి(Srinath maganti) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అనీషా ఆంబ్రోస్(Anisha Ambrose), శివాత్మిక రాజశేఖర్(Sivatmika Rajasekhar) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో ఇంట్రెస్టింగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) ENE రిపీట్ స్ట్రీమింగ్ రైట్స్ ను రూ.11 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్ లో మరో ఇంట్రెస్టింగ్ అంశం ఉంది. థియేటర్లలో ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే, అదనంగా మరో రూ.11 కోట్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ అంగీకరించినట్లు సమాచారం. దీంతో సినిమా మంచి సక్సెస్‌ను అందుకుంటే డిజిటల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు మొత్తం రూ.22 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది.
సృజన్ యరబోలు(Srujan yarabolu), సందీప్ నాగిరెడ్డి(Sandeep Nagireddy) ఈ సినిమాను సినిమాను నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు(Daggubati Suresh Babu) సమర్పిస్తున్నారు. తొలి భాగానికి ఉన్న కల్ట్ క్రేజ్, సీక్వెల్లోనూ అదే స్నేహం, ఎంటర్టైన్మెంట్ కొనసాగుతాయనే అంచనాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ డీల్‌లో ఉన్న ఈ అదనపు బోనస్ నిబంధన ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







