ప్రశాంత కోనసీమలో కులాల మధ్య వైకాపా చిచ్చు: సానా సతీశ్‌బాబు
కోనసీమ జిల్లా ప్రజలు కూటమికి పట్టం కట్టారని ఎంపీ సానా సతీశ్ బాబు (Sana Satish Babu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల్లో వందశాతం స్ట్రయిక్ రేట్ సాధించినట్లు తెలిపారు. వైసీపీ (YSRCP) పాలనలో ప్రశాంతమైన కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ వైఖరి తెలిసే ప్రజలు ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపారు. కూటమి పాలనలో కోనసీమ జిల్లా (Konaseema District) అభివృద్ధి లో దూసుకుపోతోంది అని తెలిపారు.







