ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి
తెలంగాణ రాష్ట్రంలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు (Diwali Celebrations) ఘనంగా జరిగాయి. సుమారు 2లక్షల మంది లబ్ధిదారులు తమ ఇందిరమ్మ ఇళ్లకు స్టిక్కర్లను అంటించుకుని, దీపాలను వెలిగించారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం (Kodangal Constituency)లోని పలు లబ్ధిదారుల ఇళ్లలో స్పీకర్ ప్రసాద్ కుమార్ (Prasad Kumar,), మంత్రులు సీతక్క (Seetakka), దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు.







