ప్రజాబలంతో సునామీ సృష్టిస్తాం… ఆ సునామీలో మోడీ, కేడీ కొట్టుకుపోతారు: సీఎం రేవంత్ రెడ్డి
లగచర్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
బూర్గుల రామకృష్ణారావు నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది
పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదు..
మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. మన పొలాలకు నీళ్లు అందించలేదు…
ఈ 75 ఏండ్లలో ఒకరిని అడిగే పరిస్థితే తప్ప కావాల్సింది చేసే సమయం రాలేదు
ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించిన కెసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మాం
తెలంగాణ రావాలని.. కష్టాలు తీరాలని కనిపించిన దేవుడికల్లా దండం పెట్టాం..
తెలంగాణ వచ్చినా.. ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్ కు పోయిండు
భుజాలపై మోసిన పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టాడు
కక్షగట్టి పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడు..
ఇన్నేండ్లు ఏ దేవుడు మన కష్టాలు వినలేదు
2023 లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో.. కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం దక్కింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఏ ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదు
పదేళ్లలో కేసీఆర్ 8 లక్షల 11 వేల కోట్లు అప్పు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు
నాకు అప్పు చేసే అలవాటు లేదు… అబద్ధాలు చెప్పే అలవాటు అసలే లేదు..
ప్రభుత్వం ఉద్యోగుల కష్టాలు చూసి 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వాలని ఆలోచన చేశాం
జనవరి 1 , 2024 నుంచి ప్రతీ నెల మొదటి తారీఖున జీతాలు పడుతున్నాయ్
ప్రతీ సంవత్సరం కేసీఆర్ అప్పులకు తప్పులకు 80 వేల కోట్లు చెల్లిస్తున్నాం
కేసీఆర్ అప్పులకు తప్పులకు ఈ 34 నెలల్లో 2 లక్షల కోట్లకుపైగా చెల్లించాం
మాట్లాడాలి రమ్మంటే కెసీఆర్ రాడు..
ఆయన తింటే కుంభకర్ణుడు.. పంటే బకాసురుడు.
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులు మేం మొదలు పెడితే.. కెసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటామంటున్నారు.
కేటీఆర్ కు గడ్డం రావడానికి 50 ఏండ్లు పట్టింది.. బుద్ది రావడానికి ఎన్నేండ్లు పడుతుందో
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎన్నటికీ నక్క పులి కాదు..
కేటీఆర్ నువ్ గడ్డం పెంచుకున్నా.. గడ్డం మోకాల్ల వరకు పెంచుకున్నా ఎన్నటికీ రేవంత్ కాలేవు
రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం ఉండాలి.. నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ కావాలి
పది జన్మలు ఎత్తినా నువ్వు రేవంత్ రెడ్డి కాలేవు
మేం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసుకుంటే మీకు కడుపుమంట ఎందుకు?
డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్ బీడు భూములను తడుపుతాం
కొడంగల్ భూముల్లో పచ్చని పంటలు పండేలా చేసే బాధ్యత నాది..
ఇది పోలేపల్లి ఎల్లమ్మతల్లిపై ఆన..
ఎవరు అడ్డమొచ్చినా.. అడ్డు వచ్చిన వారిని తొక్కుకుంటూ కొడంగల్ కు కృష్ణా జలాలు తీసుకొస్తాం
ఆనాడు కొడంగల్ బిడ్డలు చదువుకోవాలంటే పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండేది
ఇవాళ కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా చేసి.. ఉన్నత చదువులకు కొడంగల్ వచ్చేలా చేసుకుంటున్నాం
కొడంగల్ అభివృద్ధి జరుగుతుంటే కొందరు ఏడుపులు మొదలు పెట్టారు
ఇవాళ 9 వేల కోట్లతో కొడంగల్ లో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నాం
రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి… అభివృద్ధి పథంలో నడిపిస్తాం
కొడంగల్ ప్రజలు అండగా ఉంటే ఢిల్లీలో మోదీనైనా, కేడీనైనా ఎదిరిస్తా..
నిరంతరం పనిచేసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది
సంక్రాంతి తరువాత ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వస్తాం
అందరం కలసికట్టుగా ఎల్నినో ను ఎదుర్కొందాం
ప్రజాబలంతో సునామీ సృష్టిస్తాం…
ఆ సునామీలో మోడీ, కేడీ కొట్టుకుపోతారు..
జర్నలిస్టులు అధైర్యపడొద్దు.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది.
హాజరైన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు.







