రూ.9,053 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు : సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణ.
కొత్తవాల్గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు–2, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, రూ.2,100 కోట్లతో ఎంఎన్కేఎల్ఐఎస్ రెండో దశ పనులు .
రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు .
రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్ స్టాండ్లు, రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ణాఛ్) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు.
తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్ల పనులకు శంకుస్థాపన.
హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు.







