ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం:డిప్యూటీ సీఎం భట్టి
నిరుపేదలు, బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే ప్రగతికి నిజమైన అర్థం ఉంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం జిల్లా (Khammam District) మధిర నియోజకవర్గం పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి (Diwali) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్ మండలాల్లో మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి డిప్యూటీ సీఎం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడికి గూడు కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma house)ను నిర్మించినట్లు చెప్పారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.







