అనీష్ యాక్టింగ్ పై ఎన్టీఆర్ ప్రశంసలు
యంగ్ హీరో అనీష్(Aniesh)ను జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) స్పెషల్ గా కలిసి అభినందించడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కింగ్ నాగార్జున(Nagarjuna) సమర్పణలో తెరకెక్కుతున్న ఇట్లు అర్జున(Itlu Arjuna) సినిమాతో హీరోగా పరిచయమవుతున్న అనీష్‌కు ఎన్టీఆర్ తన ప్రోత్సాహాన్ని అందించారు. మొదటి సినిమాతోనే ఛాలెంజెస్ తో కూడిన భిన్నమైన పాత్రను ఎంచుకోవడం మామూలు విషయం కాదని, అలాంటి పాత్రలో అనీష్ తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడని ప్రశంసించారు. ముఖ్యంగా హీరోయిన్ అనస్వర రాజన్(Anaswara Rajan)తో అతడి కెమిస్ట్రీ బాగుందని అభిప్రాయపడ్డారు.
గతంలో సుమారు రెండేళ్ల క్రితం అనీష్‌ను కలిసిన సందర్భాన్ని ఎన్టీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఇంతటి బరువైన క్యారెక్టర్ ను కొత్త నటుడు సమర్థవంతంగా పోషించగలడా అనే డౌట్ తనకు కలిగిందని, అయితే ఇప్పుడు స్క్రీన్ పై అతడి టాలెంట్, డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఇలాంటి వైవిధ్యమైన క్యారెక్టర్ తో పరిచయం కావడం తనకూ ఎంతో ఇష్టమని చెబుతూ, అనీష్ యాక్టింగ్ ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమాకు తమన్(thaman) అందించిన మ్యూజిక్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచిందని కొనియాడారు.
డైరెక్టర్ మహేష్ ఉప్పాల(Mahesh uppala) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల(Venky Kudumula) నిర్మిస్తున్నారు. రొమాన్స్, యాక్షన్ అంశాలను సరికొత్తగా మేళవించిన అనుభూతిని ఆడియన్స్ ను అందించేందుకు ఇట్లు అర్జున రెడీ అవుతోంది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అనీష్‌కు, మేకర్స్ కు ఎన్టీఆర్ అందించిన ప్రోత్సాహం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.







