పవన్ కళ్యాణ్ విడాకుల లేఖ..షాక్ అవుతున్న అభిమానులు!రెండు వారాల క్రితమే హింట్ ??
పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు.. అటు సినిమా ప్రపంచంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ వెంటనే చర్చ మొదలవుతుంది. అలాంటిది ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడిపోవాలని నిర్ణయించుకున్నారంటూ ఓ లేఖ తెరపైకి వచ్చింది. ఈ విషయం నిజమేనా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠమిదీ..
మా జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయాన్ని కలిసి గడిపిన తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక జీవితం ముగిసినా, మేం మంచి స్నేహితులుగా ఉంటాం. మా చక్కని పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతాం. మా పిల్లల సంతోషం, శ్రేయస్సు మాకు ఎల్లప్పడూ ఉమ్మడి ప్రాధాన్యాలుగా ఉంటాయి. ఈ దశలో మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని, సానుభూతితో వ్యవహరించాలని, మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం. మా ప్రయాణంలో వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
పవన్ వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ!
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి గతంలోనూ చాలాసార్లు చర్చ జరిగింది. అన్నా కొణిదెల ఆయన మూడో భార్య. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న వార్త అభిమానుల్లో సహజంగానే ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా లేఖలో పరస్పర అంగీకారం, గౌరవం, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలను ప్రస్తావించడం చర్చకు మరో కోణాన్ని తీసుకొచ్చింది.
రెండు వారాల క్రితమే అన్నా కొణిదెల హింట్ ఇచ్చారా?
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోతున్నట్లు రెండు వారాల క్రితమే అన్నా లెజినోవా హింట్ ఇచ్చారని మీడియా అంటోంది. అన్నా లెజినోవా రీసెంట్ గానే సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. 2026 మార్చిలో ‘అన్నా కొణిదెల’ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి, పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి యాక్టీవ్ గా ఉంటూ రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ వస్తున్నారు.
తన భర్తకు సంబంధించిన విషయాలతో పాటుగా మెగా ఫ్యామిలీ ఫొటోలను, తన వ్యక్తిగత అభిప్రాయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.అలాగే ఇకపై తనను అందరూ ‘అన్నా కొణిదెల’ అని పిలవాలని నెటిజన్లను రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే ఉన్నట్టుండి ఆమె సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయారు. అంతేకాదు అక్టోబర్ నెలాఖరు నుంచి అన్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనిపించలేదు.దానికి కారణం ఎవరికీ అర్దం కాలేదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో విడాకుల ప్రకటన చేయడంతో, ఈ కారణం చేతనే అన్నా రెండు వారాల క్రితం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
వ్యక్తిగత విషయం.. రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుందా?
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కూడా. దీంతో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది కేవలం కుటుంబ వ్యవహారంగా మిగిలిపోయే పరిస్థితి ఉండదు. సోషల్ మీడియాలో అభిమానుల చర్చలు మొదలవుతాయి. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంటుంది.
—సూర్య ప్రకాష్







