ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన రాకింగ్ స్టార్.. పిల్లలతో కలిసి ‘రామాయణం’ సెట్స్‌లో యశ్ స్పెషల్ BTS ఫొటో రిలీజ్
పవర్ ఫుల్ రావణుడి పాత్రలో వెండితెరపై అద్భుతంగా నటించిన రాకింగ్ స్టార్ యశ్.. ఈ దీపావళికి అభిమానులకు ఓ అందమైన సర్ప్రైజ్ ఇచ్చారు. ‘రామాయణం’ సినిమా గతంలో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఓ BTS ఫొటోను యశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రావణుడి గెటప్‌లో ఉన్న యశ్‌తో పాటు ఆయన పిల్లలు అయ్రా, యథర్వ్ కూడా కనిపించారు. అద్దం ముందు పిల్లలతో కలిసి సరదాగా తీసుకున్న ఈ మిర్రర్ సెల్ఫీ.. సినిమా సెట్స్‌లోని ఓ మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది. దీనితో పాటు తన కుటుంబంతో ఉన్న మరో అందమైన ఫొటోను కూడా షేర్ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు.
ఈ BTS ఫొటోలో యశ్ రావణుడి గెటప్‌లో కనిపిస్తుండగా, అయ్రా, యథర్వ్ ఆయనతో కలిసి అద్దం ముందు సరదాగా కనిపించారు. తెరపై ఎంతో గంభీరంగా, శక్తిమంతంగా కనిపించే రావణుడి పాత్రకు పూర్తి భిన్నంగా.. పిల్లలతో యశ్ సరదాగా గడిపిన ఈ క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా యశ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకోరు. అలాంటిది పిల్లలతో కలిసి ఉన్న ఈ ఫొటోలు అభిమానులకు ప్రత్యేకమైన దీపావళి కానుకగా నిలిచాయి.
ఇవి కూడా చదవండి
‘రామాయణం’ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రేమ, ప్రశంసలు లభిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోని ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు. సినిమా గ్రాండ్ స్కేల్, విజువల్ స్పెక్టాకిల్, కథా కథనాలు భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రావణుడిగా యశ్ నటనకు విశేషమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ ఐకానిక్ పాత్రను ఆయన శక్తిమంతంగా ఆవిష్కరించిన తీరును ప్రేక్షకులు అభినందిస్తున్నారు. అన్ని మార్కెట్లలోనూ వస్తున్న ఈ అద్భుతమైన స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేసిన యశ్.. ప్రేక్షకుల ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
తెరపై పరాక్రమవంతుడైన రావణుడిగా కనిపించే యశ్.. తెర వెనుక మాత్రం పిల్లలతో సరదాగా గడిపే తండ్రిగా ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు. వెండితెరపై ఆయన పోషిస్తున్న పాత్రకు, నిజ జీవితంలో పిల్లలతో గడిపే ఈ సరదా క్షణాలకు మధ్య ఉన్న వ్యత్యాసమే ఈ ఫొటోలను మరింత ప్రత్యేకంగా నిలిపింది.







