నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త (Good news) చెప్పింది. గ్రూప్-2 (Group-2)పూర్తి స్థాయి నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ పబ్లికక్ష సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 720 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు ఆన్లైన్ (Online) దరఖాస్తులు నేటి నుంచే ప్రారంభమయ్యాయి. దరఖాస్తులు సమర్పించడానికి డిసెంబర్ 11వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు తుది గడువుగా ఏపీపీఎస్సీ (APPSC) పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టు ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. ఇది ఓఎంఆర్ ఆదారితంగా ఉంటుంది. ఆన్లైన్లో జరిగే మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తారు.







