సీఎం సహాయనిధికి కేడీసీసీబీ రూ.కోటి విరాళం
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం సమకూర్చింది. సచివాలయంలో కేడీసీసీబీ (KDCCB) చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రాఘురాం (Nettem Raghuram), మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra), ఆప్కాబ్ చైర్మన్ జి. వీరాంజనేయుల (Veeranjaneyulu)తో కలిసి సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేశారు. విరాళం సమకూర్చినందుకు వారిని చంద్రబాబు అభినందించారు.







