విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు… భారీగా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ సదస్సు (CII Conference)కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 11 నుంచి 14 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 11న ప్రీ సమ్మిట్ సమావేశాలు జరుగుతాయి. 12, 13 తేదీల్లో ప్రధాన సదస్సు జరగనుంది. 14న ప్రజల కోసం ఓపెన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈ సదస్సులో ఆరు ప్రధాన అంశాలపై చర్చ జరగనుంది. 15 మంది వివిధ దేశాల మంత్రులు, 1250 మంది పారిశ్రామిక దిగ్గజాలు ఈ సమ్మిట్ పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah), పియూష్ గోయల్ (Piyush Goyal) సదస్సును ప్రారంభిస్తే, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan,), గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు ముగింపు వేడుకలో పాల్గొంటారు.







