టెక్సాస్‌లో తిరిగి ఎన్నికైన భారతీయ అమెరికన్ న్యాయమూర్తుుల జూలీ మాథ్యూ, సురేంద్రన్ పటేల్
సురేంద్రన్ పటేల్, జూలీ మాథ్యూ మధ్యంతర ఎన్నికల్లో వీరిద్దరూ డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసి, తమ న్యాయమూర్తి పదవులకు తిరిగి ఎన్నికయ్యారు.ఇద్దరూ డెమోక్రటిక్ అభ్యర్థులుగా పోటీ చేశారు మరియు ఇద్దరికీ మలయాళీ నేపథ్యం ఉంది. 240వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ కోర్టులో పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన రిపబ్లికన్ ప్రత్యర్థి ఆశా రెడ్డిపై 1.59 లక్షల ఓట్లు (59.89 శాతం) సాధించగా, ఆమెకు 1.06 లక్షల ఓట్లు (40.11 శాతం) వచ్చాయి. ఆయన తన గెలుపు ఆధిక్యాన్ని కూడా గణనీయంగా పెంచుకున్నారు.
మాథ్యూ 1.68 లక్షల ఓట్లతో (60.10 శాతం) కౌంటీ కోర్ట్ ఎట్ లా (County Court at Law)కు తిరిగి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి జెస్సికా జరమిల్లోను ఓడించారు; ఆమెకు 1.12 లక్షల ఓట్లు (39.90 శాతం) లభించాయి.
ఇవి కూడా చదవండి
కాలికట్ విశ్వవిద్యాలయం నుండి లా పట్టా పొందిన పటేల్, 2007లో తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లకముందు హోస్దుర్గ్ కోర్టులో మరియు భారత సర్వోన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేశారు.
కేరళలోని వెన్నికులంకు చెందిన మాథ్యూ, 1986లో తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. 2018లో, ఆమె ఫోర్ట్ బెండ్ కౌంటీలో న్యాయమూర్తిగా ఎన్నికైన ఆసియా సంతతికి చెందిన మొదటి వ్యక్తిగా, అలాగే అమెరికాలో న్యాయమూర్తిగా ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ మహిళగా గుర్తింపు పొందారు.
ఇక.. ఈ సందర్భంగా మాథ్యూ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికలు చాలా భావోద్వేగపరమైన, కష్టతరమైన ఎన్నికల సంవత్సరం. మార్చిలో జరిగిన ప్రైమరీ ఎన్నికల నుండి, జూన్‌లో మా ప్రిసింక్ట్ చైర్ల ముందుకు వెళ్లడం, ఆపై సాధారణ ఎన్నికల వరకు, ఎన్నో అనిశ్చితి క్షణాలు ఎదురయ్యాయి. నా కుటుంబం, ముఖ్యంగా నా ఇద్దరు చిన్న పిల్లలు కూడా దాని భారాన్ని అనుభవించారు,” అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.







