తెలంగాణలో అడుగుపెట్టే హక్కు రాహుల్‌గాంధీకి లేదు
తెలంగాణ ప్రజలు చెల్లించిన సొమ్ముతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ ఉనికిని బతికించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరాటపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachander Rao) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతగా రాహుల్‌గాంధీకి తెలంగాణ (Telangana) గడ్డపై అడ్డుగుపెట్టే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఎన్నికల హామీలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. రాష్ట్ర ప్రజల సొమ్ముతో రాహుల్‌గాంధీని మళ్లీ రాజకీయ తెరపైకి తీసుకురావాలని రేవంత్ సర్కార్ తాపత్రయపడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలు విడుదల కాక విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. రైతుబంధు సహాయం ఇంతవరకు రైతుల ఖాతాలో పడలేదు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు పెండింగ్‌లో పెట్టారు అని విమర్శించారు.







