ఆర్టిసియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ఆర్టిసియా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్టీసియా నగరం సంయుక్తంగా మొట్ట మొదటి సారిగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి లాస్ ఏంజెల్స్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సీజీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సీజీ శ్రీనివాస్ అందరికీ దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబాలతో కలిసి అందరూ క్షేమంగా, ఆనందదాయక దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దీపావళి పర్వదినం ముఖ్య ఉద్దేశం, దాని ప్రాశస్త్యం గురించి వివరించారు.
ఇవి కూడా చదవండి
మరో వైపు ఈ దీపావళి పర్వదినం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రకరకాల వేషధారణలతో భారతీయులు వివిధ రకాలైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి అక్కడి వారిని ఎంతో ఆకట్టుకున్నాయి. మొదటి సారిగా దీపావళి వేడుకలు జరగడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, దీని ద్వారా భారతీయ సమాజ ప్రాశస్త్యం, పండగలు, పరమార్థాలు ప్రపంచానికి తెలిసినట్లు అయ్యిందని భారతీయులు ఆనందం వ్యక్తం చేశారు.







