నితిన్ కొత్త సినిమాకు డైరెక్టర్ ఫిక్స్
యంగ్ హీరో నితిన్(nithin)కు ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కడం లేదు. వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ హీరో, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నాని(Nani) నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్(Unanimous Productions) లో అలియాస్ రుక్మిణి(Alias Rukmini) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో పాటు మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివాహ భోజనంబు(Vivaha Bhojanambu), సామజవరగమన(Samajavaragamana), నారీ నారీ నడుమ మురారి(nari nari naduma murari) సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు(Ram abbaraju) ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం శ్రీ విష్ణు(Sree Vishnu)తో ఫ్యామిలీ ప్యాక్(Family Pack) సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన, సంక్రాంతి 2027 తర్వాత నితిన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పై ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) పేరును పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. నితిన్ మేనేజర్ ఎస్. వెంకటరత్నం(S. Venkata ratnam) ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) నిర్మాణంలోనూ నితిన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 2027 సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇలా ఒకేసారి విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నితిన్ రెడీ అవుతున్నారు. రామ్ అబ్బరాజు మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ నితిన్‌కు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తాయో చూడాలి. ఈ కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వెలువడే అవకాశముంది.







