పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు దిశానిర్దేశం
కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచన
పట్టణ, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసి కూటమి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారు.
కూటమి పట్ల ప్రజలు ఎంతో సానుకూలంగా ఉన్నారు.
రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ప్రతిఒక్కరు సీరియస్ గా తీసుకోవాలి.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరు కృషిచేయాలి.
ప్రతి ఎన్నిక ముఖ్యమే. మీ పరిధిలోని ఆయా బూత్ లలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఎన్నికల వ్యూహరచన పకడ్బందీగా ఉండాలి.
ప్రతి ఓటూ కీలకమే. ప్రజలను ఎక్కడికక్కడ మొబిలైజ్ చేయాలి.
రెబల్స్ విషయంలో స్థానిక నాయకత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలి.
కూటమి పార్టీల మధ్య వంద శాతం ఓటు ట్రాన్స్ ఫర్ జరిగేలా కృషిచేయాలి.
కూటమిలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలి.
బాగా పనిచేసిన నాయకులకు భవిష్యత్ లో తగిన అవకాశాలు కల్పిస్తాం. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తాం.
మొదటి దశ కంటే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రావాలి.
ఇవి కూడా చదవండి







