రాజమహేంద్రవరంలో ఘనంగా న్యాయ ఉత్సవం
రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం ఏర్పడి 222 ఏళ్లు. బార్ అసోసియేషన్ స్థాపించి 131 ఏళ్లు అయినా సందర్భంగా న్యాయ ఉత్సవాన్ని (Nyaya Utsavam) ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ఒక్క రాజమహేంద్రవరానిదే కాదు, రాష్ట్రం మొత్తానిదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి (Justice S.V.N. Bhatti) అన్నారు. ఒక కోర్టు ఏర్పడి 222 ఏళ్లు పూర్తయ్యిందంటే గొప్ప విషయమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరానికి ఎంతో ఘన చరిత్ర ఉందని జస్టిస్ పీఎస్ నరసింహ (Justice P.S. Narasimha) అన్నారు. ఎంత చదివినా మన విజ్ఞానం పది మందికి ఉపయోగపడాలన్నారు. ప్రజలకు చాలా దగ్గరగా ఉండేలా మన వ్యవస్థ పనిచేయాలని సూచించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), హైకోర్టు సీజే జస్టిస్ లిసా గిల్, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, లాయర్లు తదితరులు పాల్గొన్నారు.







