ఏఐసీసీ ఇన్ఛార్జ్ సందీప్‌తో మంత్రి వివేక్ భేటీ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్ (Sandeep) ను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkatswamy), పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(Gaddam Vamshi Krishna) మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీభవన్ లో సందీప్‌తో వివిధ అంశాలపై చర్చించారు. మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu), పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వర్గీయుల మధ్య కొద్దికాలంగా అంతర్గత వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇరువర్గాలు క్రమశిక్షణ కమిటీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశాన్ని వివేక్, వంశీకృష్ణ సందీప్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.







