TAGDV ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం
గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘము (TAGDV) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగానే జనవరి 23 వ తేదీన ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘము ఓ ఫ్లయర్ ను విడుదల చేసింది. జనవరి 23 వ తేదీన మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. E.N. Peirce Middle school, 1314 burke rd, west chester PA19380 వేదికగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం అధ్యక్షుడు హరీశ్ అన్నాబత్తిన సారథ్యంలో సురేశ్ బొందుగుల (వైస్ ప్రెసిడెంట్), శివ అనంతుని (సెక్రెటరీ), మధు బూదాటి (ట్రెజరర్), లవ కుమార్ ఐనంపూడి (జాయింట్ సెక్రెటరీ), స్వాతి కొండేటి (జాయింట్ ట్రెజరర్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.
సంక్రాంతి అనేది ఆంధ్రులకు అతిపెద్ద ముఖ్యమైన పండగ అని, దీనిని అందరూ కలిసి జరుపుకోవడం ద్వారా మరిచిపోలేని అనుభూతులను మిగిల్చుకోవడానికి అవకాశం వుంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ముందుగానే తేదీని ప్రకటించామని, అందరూ ఈ తేదీని సేవ్ చేసుకొని, సంక్రాంతి సంబరాలకు తప్పకుండా రావాలని ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.tagdv.com వెబ్ సైట్ ను సంప్రదించవచ్చును.







