అందుకే గ్లోబల్ సమ్మిట్‌లో క్లైమేట్ కాన్క్లేవ్ : సీఎం రేవంత్ రెడ్డి
టీసీ కాకతీయలో క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం గారు మాట్లాడుతున్నారు
మూసి మురికికూపంలా మారింది..
మూసీలో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశాం.
త్వరలో సుందరమైన మూసీని చూస్తారు.
మూసీపై అనేక అభ్యంతరాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు.
భావి తరాల కోసం పనిచేస్తున్నాం..
అందుకే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం..
ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా ఉంది.
వాతావరణ మార్పులను ఎదుర్కోవాలి.
2 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అందరం వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలి..
అందుకే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది..
నెహ్రూ విద్య, నీటిపారుదలపై దృష్టి పెట్టారు..
అందుకే అనేక విద్యాసంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి..
వచ్చే 2 ఏళ్లకు సరిపోయే తిండి గింజలు ఉన్నాయి.. కానీ నీళ్లు లేవు.
ఈ సమస్యలను అధిగమించాలి..
ఇప్పుడు వచ్చిన కరువు..
రాబోయే 8 నెలలు వర్షాలు రావు..
కరువును రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాలి..
కోవిడ్ తరహాలోనే ఎల్‌నినోను ఎదుర్కోవాలి..
రైతులు ఒక పంటను త్యాగం చేస్తే పశుపక్ష్యాదులకు నీళ్లు ఉంటాయి.
మానవాళిని కాపాడుకునే బాధ్యత రైతులకు ఉంది.
రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది..
పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, వాతావరణాన్ని కాపాడుకునే అంశంపై దృష్టి పెడుతున్నాం.
భవిష్యత్ తరాల కోసం ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం.
ఫలితాలు ఈరోజు రావొచ్చు.. రేపు రావొచ్చు.
సునామీలు, భూకంపాలు వస్తే నష్టం వెంటనే జరుగుతుంది. కానీ కరువు అలా కాదు.
ఎల్‌నినో ప్రభావం ఒక్క తెలంగాణలోనే లేదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో దీని ప్రభావం ఉంది.
వాతావరణ మార్పులను మనం సరిగ్గా పరిశీలించడం లేదు.
రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని ఆధారంగా చేసుకుని హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.
కానీ రెండు గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు వచ్చి కాలనీలు మునిగిపోతున్నాయి.
కోవిడ్ తర్వాత వాతావరణ మార్పులు అంతుపట్టకుండా ఉన్నాయి.
మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్యతో పాటు సాగునీటి రంగంపై కూడా దృష్టి పెట్టారు.
ఫలితంగా అనేక విద్యాసంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి.
నెహ్రూ తీసుకున్న చర్యల కారణంగానే ఇప్పుడు మనకు మిగులు ఆహార నిల్వలు ఉన్నాయి.
రైతులు నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలను వేయొద్దు.
ప్రకృతి విసిరిన సవాల్‌ను మనమంతా ఎదుర్కోవాలి.
కరువు వచ్చినప్పుడు గతంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసేవారు.
ఇప్పుడు వచ్చింది తిండి గింజల కరువు కాదు.. నీళ్ల కరువు.
వచ్చే ఎనిమిది నెలల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదు.
చలికాలంలోనే ఎండాకాలం తరహా వాతావరణం కనిపిస్తోంది.
కలిసికట్టుగా కరువును ఎదుర్కోవాలి.
కోవిడ్‌ను అందరం కలిసికట్టుగా ఎదుర్కొన్నాం కాబట్టే మానవజాతి మనుగడ సాగించింది.
కోవిడ్ లాంటి సంక్షోభమే ఇప్పుడు ఎల్‌నినో రూపంలో వచ్చింది.
వచ్చే రెండేళ్ల వరకు ఆహార ధాన్యాల కొరత లేదు. ప్రతి ఒక్కరికీ ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వానిది.
ఉన్న నీటితో ఎనిమిది నెలలు మనుగడ సాధించాలి.
రైతును రాజు చేయాలన్నదే మా విధానం. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే మా లక్ష్యం.
మానవాళిని ఆదుకునే బాధ్యత రైతుల భుజాలపై ఉంది.
పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఒక భాగం.
గ్లోబల్ సమ్మిట్‌లో క్లైమేట్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నాం.
దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టాలి.
తెలంగాణ రైజింగ్ 2047 విధానాన్ని తీసుకువచ్చాం.
తెలంగాణ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు.
హైదరాబాద్‌లో రెండు లక్షల డీజిల్ ఆటోలను ఈవీలుగా మారుస్తున్నాం. ప్రభుత్వమే ఉచితంగా ఈవీలుగా మారుస్తుంది.
డీజిల్‌తో నడిచే ఆర్టీసీ బస్సులను హైదరాబాద్ బయటకు తరలిస్తున్నాం.
360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు రాబోతోంది.
క్యూర్, ప్యూర్, రేర్‌గా రాష్ట్రాన్ని విభజించాం.
రాష్ట్రంలో పాలసీ ప్యారాలసిస్ లేదు.
అనేక పాలసీలను తీసుకువచ్చాం.
మూడు వేల మందితో కూడిన ఈగల్ ఫోర్స్ డ్రగ్స్‌ను నియంత్రిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈగల్ ఫోర్స్‌ను అభినందించింది.
ఆహార కల్తీని నియంత్రించేందుకు టీజీ సేఫ్‌ను తీసుకువచ్చాం.
చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రాను తీసుకువచ్చాం.
ఈ మూడు సంస్థలు దేశంలో మరెక్కడా లేవు.
డ్రగ్స్‌ను కఠినంగా అణచివేస్తున్నాం. డ్రగ్స్ దందాకు పాల్పడేవారిని వదిలిపెట్టడం లేదు.
డ్రగ్స్ కారణంగా పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది.
నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంతకాలం తప్పు చేసినవారిని వదిలిపెట్టం.
ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్, పద్మశ్రీ చింతల వెంకట్ ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు,స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ సీతక్క కూడా పాల్గొన్నారు.







