GWTCS నూతన కార్యవర్గం ఏర్పాటు.. అధ్యక్షునిగా సుశాంత్ మన్నె…
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం అధ్యక్షునిగా సుశాంత్ మన్నె ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ బృందం మొత్తానికి కమిటీ ప్రతినిధులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
GWTCS నూతన కార్యవర్గం ఇదే…
అధ్యక్షుడు: సుశాంత్ మన్నె
ఉపాధ్యక్షుడు (సంస్థాగత): యశస్వి బొడ్డులూరి
ఉపాధ్యక్షురాలు (సాంస్కృతిక): శ్రీవిద్య సోమ
ఉపాధ్యక్షుడు (యూత్): యువ సిద్ధార్థ బోయపాటి
కార్యదర్శి (సంస్థాగత): భాను ప్రకాష్ మాగులూరి
కార్యదర్శి (సాంస్కృతిక): పావని పూదోట
కోశాధికారి (సంస్థాగత): శ్రీనివాస్ బాబు గంగ
సంయుక్త కోశాధికారి: సూర్య తేజ కోసరాజు
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్: యుగంధర్ ముక్కామల, కృష్ణ గుడిపాటి, పద్మజ బెవర, అశ్విన్ పుప్పాల.
2027-2028 పదవీకాలానికి కూడా తమ సేవలను కొనసాగిస్తున్న మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉమాకాంత్ రఘుపతి గారికి & శివాజీ మేడికొండ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 2027-2028 నూతన బృందం తమ బాధ్యతలలో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మన GWTCS మరింతగా అభివృద్ధి చెందుతూ, మన తెలుగు సమాజాన్ని ఏకతాటిపైకి తెస్తూ, మన సంస్కృతిని ఘనంగా చాటిచెబుతూ, రాబోయే తరాలకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నామని ప్రతినిధులు పేర్కొన్నారు.
‘‘తెలుగు టైమ్స్’’ పక్షాన కూడా నూతన కార్యవర్గానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.







