ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న కీలక తీసుకుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ (ఏఎస్ఏ) మధ్య సచివాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ (S.S. Rawat), కార్యదర్శి ఆమ్రపాలి (Amrapali) సమక్షంలో నిమాస్ డైరెక్టర్ కల్నల్ రణవీర్ సింగ్ జమ్వాల్ (Colonel Ranveer Singh Jamwal), అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ కార్యదర్శి ఉన్నాది రఘునాథ్‌రెడ్డి (Unnadi Raghunath Reddy) ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానిక యువతకు వృత్తిపరమైన శిక్షణ అందించి, వారిని అర్హత కలిగిన అడ్వెంచర్ గైడ్లు, ఇన్స్ట్రక్టర్లు, రెస్క్యూ సిబ్బంది, అవుట్డోర్ లీడర్లు, పర్యాటక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తెలిపారు.







