కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ క్యాబినెట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆధ్వర్యంలో సమావేశమైన క్యాబినెట్ (Cabinet) రాష్ట్ర అభివృద్ధికి ఊళిమిచ్చేలా 30 అంశాలకు ఆమోదం తెలిపింది. పరిశ్రమల ఏర్పాటులో జ్యాపం నివారించేలా ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు (AP MSME Right to Business Bill)2026కు ఆమోదం తెలిపింది. సీఐఐ సదస్సు (CII Conference)లో ఒప్పందాలు చేసుకున్న 6 సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ సంస్థల ద్వారా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, వేýమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పెనుగొండలో రూ.19వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటు, శ్రీకాకుళంలో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
అచ్యుతాపురంలో సెయింట్ గోబైన్ ఫ్లోట్ తయారీకి పరిశ్రమకు ఆమోదం. అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ పనులకు భారీగా నిధుల కేటాయింపు. సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయం రూ.6.641 కోట్లకు పెంపు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,215 కోట్ల విలువైన పనులకు ఆమోదం. శాఖమూరు అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. రాజధాని గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ`2 కింద రూ.180.68 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం. విద్యుత్ అవసరాలకు కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఏపీజెన్కో అనుమతి. మైలవరంలో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 1127 ఎకరాల భూమి కేటాయింపు. నంద్యాల జిల్లాలో 210 మెగవాట్ల పవన్ విద్యుత్ ప్రాజెక్టు బదిలీకి అనుమతి.







