నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా ఎప్పుడంటే?
వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) సినిమాల సెలెక్షన్ లో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైన అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) తర్వాత వరుసగా సినిమాలు చేస్తానని అనౌన్స్ చేసిన ఆయన ఇప్పటివరకు మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లలేదు. సినిమా రిలీజై పది నెలలు గడుస్తున్నప్పటికీ నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న నవీన్ పోలిశెట్టి తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాతో ఓ కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్లు సమాచారం. నవీన్ శైలికి అనుగుణంగా ఎంటర్టైన్మెంట్ కు పెద్దపీట వేస్తూ స్టోరీని రెడీ చేస్తున్నారట. ఈ ఇయర్ ఎండింగ్ కు స్క్రిప్ట్ వర్క్స్ ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్లో యంగ్ హీరోలు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే నవీన్ మాత్రం కథ విషయంలో రాజీపడకుండా టైమ్ తీసుకుంటున్నారు. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2027లోనే ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది. మరి ఈసారి నవీన్ ఎలాంటి కథతో ఆడియన్స్ ను అలరిస్తారో చూడాలి.3







