బాలయ్య సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్?
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ(koratala siva) కలయికలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar)ను ఎంపిక చేసినట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదట అనిరుధ్(Anirudh)ను తీసుకోవాలని మేకర్స్ భావించినప్పటికీ, ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో జీవీ ప్రకాష్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
ఇటీవల ఇరుముడి(Irumudi), ఆకాశంలో ఒక తార(Aakasam lo Oka taara) సినిమాలకు అందించిన మ్యూజిక్ తో తెలుగు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు జీవీ ప్రకాష్. ప్రస్తుతం వెంకటేష్(Venkatesh), కళ్యాణ్‌రామ్(Kalyan ram) ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న జనవరి 12 విడుదల(January 12 vidudhala) సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమాకు కూడా ఆయన ఎంపిక కావడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ నేపథ్యంతో రూపొందనున్న ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా నిలిచే అవకాశముంది.
మరోవైపు కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ సెలెక్షన్ పై మేకర్స్ దృష్టి సారించారు. సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri), సుధాకర్ మిక్కిలినేని(Sudhakar mikkilineni) సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 సెకండాఫ్ లో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనేది నిర్మాతల ప్లాన్ గా తెలుస్తోంది. బాలయ్య, కొరటాల కాంబినేషన్లో రానున్న ఈ రాజకీయ కథాంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.







