సంక్రాంతి బరిలో మెగా సినిమాలు.. ఈక్వేషన్స్ మారనున్నాయా?
2027 సంక్రాంతి సినిమా రిలీజుల విషయంలో మెగా ఫ్యాన్స్ లో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న కాకా(kaaka) సినిమాను జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే, కొంతకాలంగా రిలీజ్ కు నోచుకోని విశ్వంభర(Vishwambhara)ను కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ నుంచి ప్రెజర్ పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి రిలీజ్ కు చిరంజీవి సైతం అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ఒకే సీజన్లో చిరంజీవి నటించిన రెండు భారీ సినిమాలు రిలీజ్ కావడం బిజినెస్ పరంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగినట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాకాను సమ్మర్ కు వాయిదా వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి రిలీజ్ వాయిదా పడితే, ఆ డేట్ ను కాకా కోసం పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు సాయిధరమ్ తేజ్(Sai dharam tej) నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమా సంబరాల ఏటిగట్టు(Sambarala yetigattu) కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే చిరంజీవి సినిమాతో పోటీని నివారించేందుకు ఈ సినిమాను సైతం మరో అనువైన తేదీకి మార్చే అవకాశముందని తెలుస్తోంది. మెగా సినిమాల మధ్య పోటీ లేకుండా రిలీజ్ డేట్స్ ను బ్యాలెన్స్ చేసే దిశగా డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్ తొలి వారంలోగా ఈ సినిమాల రిలీజులపై అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.







