టీటీఏ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం
అమెరికాలోని నార్త్ కరోలినా వేదికగా తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘తెలంగాణ అమెరికా తెలుగు సంఘం'(TTA) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. “మా బతుకమ్మ.. మా తెలంగాణ గౌరమ్మ” నినాదంతో ప్రవాస తెలుగు కమ్యూనిటీని ఒకతాటిపైకి తీసుకువచ్చేలా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు చాటిచెప్పే ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుగు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
వేడుకల తేదీ, సమయం…
బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 11, 2026 నవంబర్ ఆదివారం రోజున నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నార్త్ కరోలినాలోని మాథ్యూస్ (Matthews, NC 28105) ప్రాంతంలో ఉన్న 11501 ఐడల్వైల్డ్ రోడ్ (11501 Idlewild RD) చిరునామాలో ఉన్న ప్రాంగణం ఈ వేడుకకు వేదికగా నిలవనుంది. ఈ వేడుకలకు వచ్చే వారికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదని (Free Entry), అలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం (Free Parking) కల్పించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు…
ఈ సంబరాలలో భాగంగా తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో కోలాహలంగా బతుకమ్మ ఆటలు ఆడనున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులు(Special Guests) విచ్చేయనుండగా, అద్భుతంగా బతుకమ్మలను పేర్చిన వారికి, ప్రదర్శించిన వారికి Best Bathukamma Awards అందజేయనున్నారు.
నిర్వాహక కార్యవర్గ వివరాలు
ఈ వేడుకలను విజయవంతం చేయడానికి టీటీఏ అధ్యక్షులు నవీన్ రెడ్డి మలిపెద్ది, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ వీరమనేని, జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్లా, ట్రెజరర్ సహోధర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవితా రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వీరితో పాటు జాయింట్ సెక్రటరీ నిశాంత్, హెల్త్ & వెల్నెస్ అడ్వైజర్ శ్రీకాంత్ గాలి, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు అభిలాష్ ముదిరెడ్డి, నరేంద్ర దేవరపల్లి, ఉమెన్స్ ఫోరమ్ అడ్వైజర్ పల్లవి రెడ్డి రామిడి తదితరులు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అందరూ వచ్చి మన సంప్రదాయాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు.








