12వ వార్షిక గ్రేటర్ ఫిలీ టీటీఏ బతుకమ్మ , దసరా సంబరాలకు పెన్సిల్వేనియాలో అట్టహాసంగా ఏర్పాట్లు!
అమెరికాలోని పెన్సిల్వేనియా వేదికగా తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను సమున్నతంగా చాటిచెప్పేలా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(TTA) ఆధ్వర్యంలో 12వ వార్షిక గ్రేటర్ ఫిలీ దసరా సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రవాస తెలుగు కమ్యూనిటీని ఒకే వేదికపైకి తీసుకువచ్చి పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
వేడుకల వివరాలు
ఈ ప్రతిష్టాత్మక దసరా సంబరాలు 2026 అక్టోబర్ 24వ తేదీ, శనివారం రోజున సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు నిర్వహించనున్నారు. పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ (West Chester, PA 19380) ప్రాంతంలో ఉన్న Fuggett Middle School, 500 Ellis Ln ఈ వేడుకకు వేదికగా నిలవనుంది.
ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు…
ఈ వేడుకల్లో భాగంగా ప్రవాస తెలుగువారి కోసం ప్రత్యేకంగా రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈ సభకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమంలో కార్తీక్ కుర్వి, శ్వేత కొమ్మోజు యాంకర్లుగా వ్యవహరించనుండగా, ప్రముఖ గాయకుడు అద్వైత్ బొందుగుల తన మధురమైన గళంతో లైవ్ మ్యూజిక్ అందించనున్నారు. కుటుంబ సభ్యులు , స్నేహితులతో కలిసి అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని టీటీఏ గ్రేటర్ ఫిలీ నిర్వాహకులు పిలుపునిచ్చారు.








