ఘనంగా నెబ్రాస్కా తెలుగు సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. అధ్యక్షుడిగా తాతారావు కోసూరి
అమెరికాలోని తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా 2026–2027 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఒమాహా నగరంలోని హిందూ టెంపుల్ సోషల్ హాల్లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నూతన కార్యవర్గం అక్టోబర్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2027 వరకు పదవిలో కొనసాగనుంది.
ఈ వేడుకలో భాగంగా మాజీ అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ గత ఏడాది కాలంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు , సేవా కార్యకలాపాల నివేదికను సభ్యులకు వివరించడంతో పాటు, తనకు ఈ అవకాశం కల్పించిన సమితి సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తాతారావు కోసూరి మాట్లాడుతూ.. గత కార్యవర్గం వేసిన బలమైన పునాదిపై మరింత ముందుకు వెళ్తూ భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.
నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:
అధ్యక్షులు: తాతారావు కోసూరి
ఉపాధ్యక్షులు (Vice President): సాంబ దివ్వెల
కార్యదర్శి (Secretary): రమేష్ రాయపాటి
కోశాధికారి (Treasurer): యుగంధర్ పంగా
సాంస్కృతిక కార్యదర్శి (Cultural Secretary): వినీల నాయుడు
జాయింట్ సెక్రటరీ: వీరేంద్రనాథ్ ముప్పవరపు
జాయింట్ ట్రెజరర్: బాల కామిరెడ్డి
జాయింట్ కల్చరల్ సెక్రటరీ: నాగ స్వప్న అడగిరి
కార్యవర్గ సభ్యులు (EC Members): ధన గొట్టిపాటి, అవినాష్ మదూరి, క్రాంతి సుధ, శ్రీమతి శ్రీదేవి కొరగంజి (లింకన్), నరేష్ కుమార్ తోడుకూరి, శంకర్ తలం, దత్తా రాజేష్ గుంటూరు
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వివిధ కమిటీలు:
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్: అనూప్ మానిక్య, అనిల్ పోతినేని, రమ్య రవిపాటి, శ్రీమతి లక్ష్మీ మాధురి చిన్ని, చైతన్య రవిపాటి
ఎమర్జెన్సీ రెస్పాన్స్ స్క్వాడ్: ప్రసాద్ కొల్లి, సుందర మూర్తి చొక్కర, వెంకట్ రమేష్ స్వర్ణ
స్కాలర్షిప్ కమిటీ: సుందర మూర్తి చొక్కర, ఫణి తేజ్ అడిదం, మురళీధర్ చింతపల్లి
యూత్ కమిటీ: క్రాంతి సుధ, వివేక్ పోశాల, వీణా మాధురి ద్రోణాదుల, మానస్వి పడాల, ఆర్య యర్లగడ్డ, అరుష్ పుటంబేకర్, సమన్వి కంటం, దీపిక సరవణన్, సుధాంశు చిందం, హరి
సలహా కమిటీ (Advisory Committee): అనిల్ తాటి, అశోక్ ముద్గపల్లి, క్రాంతి అదిదం, సత్యనారాయ పావులూరి, మహేష్, సోమ శేఖర్ కొడాలి, నరేందర్ సామ, నాగరాజు ముదెల్లి, నవీన్ కంటెం, శరత్ బొడేపూడి, రాంబాబు కల్లేపల్లి, ప్రసాద్ కొల్లి, రాజా కోమటిరెడ్డి
నామినేషన్స్ కమిటీ: ప్రసాద్ కొల్లి
ఛారిటీ & ఫండ్ రైజింగ్ (లింకన్): నీలిమ మంచికలపాటి, రమా జాస్తి, పద్మజ పదర్తి, ముఖేష్ యర్లగడ్డ, శ్రీదేవి కొరగంజి (లింకన్)
ఛారిటీ & ఫండ్ రైజింగ్ (ఒమాహా): సత్యనారాయణ పావులూరి, నరేష్ కుమార్ తోడ్కూరి, అవినాష్ మదూరి, రాజా కోమటిరెడ్డి, ప్రసాద్ కొల్లి, తాతారావు కోసూరి, సాంబ దివ్వెల, అనూప్ మానిక్య, వేణు గోపాల్ మురకొండ
ఐటీ & పీఆర్ (IT & PR): అలగన్ కంచర్ల, అవినాష్ మదూరి
సాంస్కృతిక విభాగం: వినీల నాయుడు, నాగ స్వప్న అడగిరి, శ్రీమతి సుభాశ్రీ కొడూరు
క్రీడా కమిటీ (Sports): బాల కామిరెడ్డి, కార్తీక్ వేపూరి (లింకన్), రమ్య రవిపాటి, కృష్ణ చైతన్య, నవీన్ కంటెం, జ్ఞానేశ్వర్ పున్న, యుగంధర్ పంగా, అలగన్ కంచర్ల, హనుమంతు నీలంరాజు
ఫుడ్ కమిటీ: వెంకట్ సుమన్ మద్దుల, ధనారావ్ గొట్టిపాటి, జితిన్ నంది, అనిల్ పోతినేని, సుందర మూర్తి చొక్కర, సురేంద్ర ఖండవల్లి
ఆడిట్ కమిటీ: సాంబ దివ్వెల, యుగంధర్ పంగా, రాజా కోమటిరెడ్డి, ప్రసాద్ కొల్లి, తాతారావు కోసూరి, అనూప్ మానిక్య, సత్యనారాయణ పావులూరి
తెలుగు బడి ఉపాధ్యాయులు…
పవిత్ర గేదుపూడి (ప్రిన్సిపల్), దివ్య ముక్క (వైస్ ప్రిన్సిపల్), వీణా మాధురి ద్రోణాదుల, అర్యాని సుహిత రాయ్ గోటూర్, సువర్ణ రేఖ కరుమంచి, సుధీర్ లంక, మౌనిక కుడికాల, తనూజ యెర్రమపుల, ఉమామహేశ్వర్ రెడ్డి యెద్దుల, రాజా కోమటిరెడ్డి, స్వప్న బురామోని, వేణు గోపాల్ మురకొండ, రవి కండాల, దత్తా రాజేష్ గుంటూరు, మాధవి ఎంజమూరి, ఝాన్సీ తదితరులు ఈ నూతన కార్యవర్గంలో బాధ్యతలు స్వీకరించారు.









