రోకో ఫ్యూచర్ పై నోరు మూయించేలా గిల్ కౌంటర్..!
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు, ఫామ్‌పై వస్తున్న విమర్శలకు టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గట్టిగా బదులిచ్చాడు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల వయసును (కోహ్లీ 37, రోహిత్ 39) ప్రస్తావిస్తూ కొందరు చేస్తున్న విమర్శలపై గిల్ తీవ్రంగా స్పందిస్తూ, విమర్శకుల నోళ్లు మూయించేలా సమాధానమిచ్చాడు. మూడో వన్డే ముగిసిన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ..
“కోహ్లీ, రోహిత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో రోహిత్ భాయ్ మూడు సెంచరీలు బాదారు. విరాట్ భాయ్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ఒకవేళ వారు విఫలమైనా కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు బాధ్యత తీసుకుని జట్టును ఆదుకుంటున్నారు” అని ప్రశంసించారు. విండీస్‌తో జరిగిన ఈ సిరీస్‌లో కోహ్లీ తొలి వన్డేలో, రోహిత్ రెండో వన్డేలో అద్భుత శతకాలు బాదగా, మూడో వన్డేలో రోహిత్ 92 పరుగుల వద్ద అవుటయ్యారు. సీనియర్లకు విశ్రాంతినిచ్చి కొత్త ఆటగాళ్లను పరీక్షించే ఆలోచన ఉందా అని అడిగిన ప్రశ్నకు గిల్ పూర్తిగా నిరాకరించాడు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం వన్డే మ్యాచ్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అందువల్ల ప్రయోగాలకు అస్సలు సమయం లేదని తేల్చి చెప్పాడు. రాబోయే వరల్డ్ కప్‌లో ఏ కాంబినేషన్‌తో అయితే ఆడాలనుకుంటున్నామో, రాబోయే సిరీస్ ల నుండి పూర్తి స్థాయి జట్టు అందుబాటులోకి వచ్చిన వెంటనే అదే కాంబినేషన్‌తో బరిలోకి దిగుతామని గిల్ స్పష్టం చేశాడు. విండీస్ సిరీస్ ముగియడంతో భారత జట్టు తదుపరి వన్డే సిరీస్‌ను దాదాపు నెల రోజుల తర్వాత న్యూజిలాండ్‌తో ఆడనుంది.








