నవంబర్ 1 న శాన్ ఆంటోనియా తెలుగు సంఘం (TASA) ఆధ్వర్యంలో దసరా, దీపావళి సెలబ్రేషన్స్
శాన్ ఆంటోనియా తెలుగు సంఘం (TASA) ఆధ్వర్యంలో నవంబర్ 1 వ తేదీన దసరా, దీపావళి సంబరాలు 2026 వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రకటించింది. అలాగే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు కోటి 50 ఏళ్ల సంగీత ప్రయాణం నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఈ సెలబ్రేషన్స్ కి మరో ప్రత్యేకత కూడా వచ్చింది. ఈ వేడుకలు ష్రిన్ ఆడిటోరియం, 901,N LOOP1604W, SAN ANTONIO, TX 78232 లో జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు ముందుగా బుక్ చేసుకుంటే.. మెంబర్స్ అయితే 20 డాలర్లు, నాన్ మెంబర్స్ అయితే 25 డాలర్లు, కిడ్స్ అయితే 15 డాలర్లు చెల్లించాల్సి వుంటుంది. అంతేకాకుండా అక్టోబర్ 26 వ తేదీ కల్లా ఈ రుసుమును చెల్లించాల్సి వుంటుంది. మిగతా పేమెంట్ కి సంబంధించిన విషయాలు ఫ్లయ్యర్ లో చూడవచ్చు. టిక్కెట్స్ బుక్ చేసుకునే వారు ఫ్లయర్ లో క్యూ ఆర్ కోడ్ వుంటుంది. దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు.,
ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి మీ మీ కుటుంబ సభ్యులందర్నీ తీసుకొని రావాలని శాన్ ఆంటోనియో తెలుగు సంఘం ఆహ్వానిస్తోంది. అధిక సంఖ్యలో హాజరవ్వడం ద్వారా కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చడంతో పాటు ఆనందోత్సాహాలతో కూడా కార్యక్రమాన్ని జరుపుకోవచ్చని అన్నారు.
అందరి మద్దతుతో, మన తెలుగు సంస్కృతిని పరిరక్షించుకుంటూ, మన సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను తీసుకురండి, అందరం కలిసి వేడుక జరుపుకుందాం. అద్భుతమైన సంగీతం, సంస్కృతి, ఉత్సవాలు మరియు ఎంతో సరదాతో నిండిన ఈ సాయంత్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకుందాం.
ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, పూర్తి సమాచారం కోసం, వెండార్ స్టాల్స్ పెట్టుకోదలచిన వారు ప్రెసిడెంట్ ఆదినారాయణ (919-916-0919), ఎలెక్ట్ ప్రెసిడెంట్ నీరజ సుంకర (210-8271881) ను సంప్రదించవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 1, 2026
వేదిక : Shrine Auditorium, 901 N LOOP 1604 W,
SAN ANTONIO, TX 78232
అక్టోబర్ 26 వ తేదీ లోపు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటే
మెంబర్స్ కి 20 డాలర్లు
నాన్ మెంబర్స్ కి 25 డాలర్లు
కిడ్స్ కి 15 డాలర్లు








