‘మాటా’ న్యూజెర్సీ బతుకమ్మ, దసరా వేడుకలకు సర్వం సిద్ధం
మన అమెరికా తెలుగు సంఘం (MATA) న్యూజెర్సీ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.
వేడుకల వివరాలు ..
తేదీ , సమయం: అక్టోబర్ 17, 2026 న మధ్యాహ్నం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
వేదిక: రాయల్ అల్బర్ట్స్ ప్యాలెస్, 1050 కింగ్ జార్జెస్ పోస్ట్ రోడ్, ఫోర్డ్స్, NJ 08863.
ప్రధాన ఆకర్షణలు..
ఈ వేడుకల్లో దుర్గా పూజ, న్యూజెర్సీలోనే అతిపెద్ద బతుకమ్మ, అత్యుత్తమ బతుకమ్మలకు 5 బహుమతులు, ఉత్తమ వస్త్రధారణ ఉన్న మహిళలకు బహుమతులు, రాఫిల్ టికెట్లు, వెండర్ స్టాల్స్, బొమ్మల కొలువు , సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి. అలాగే ప్రసాద వితరణ కూడా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
సంప్రదించాల్సిన వివరాలు..
ఈ కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితం. హాజరుకావాలనుకునేవారు పోస్టర్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ముందుగా నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం నిర్వాహకులు పూర్ణ బెదుపుడి (732-856-7820), నరేందర్ ఎర్రంగురి (201-962-0284), వేణు గిరి (732-910-9017)ని సంప్రదించవచ్చు. వెండర్ స్టాల్స్ కోసం దీపక్ కట్టా (337-660-6248), వెంకీ ముస్తీ(908-367-8139), స్పాన్సర్షిప్ల కోసం విజయ్ భాస్కర్ కలాల్ (201-774-2221), శిరీష గుండపునేని (201-410-8947) లను సంప్రదించాలని కోరారు.








