నవంబర్ 14 న గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిపేందుకు రూపకల్పన చేశారు. నవంబర్ 14 వ తేదీన మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం అవుతాయని గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం ప్రకటించింది.
ఈ వేడుకలు UPPER MERION AREA MIDDLE SCHOOL 450 Keebler RD, KING OF PRUSSIA, PA 19406 లో జరగనున్నాయి. ఈ వేడుకలకు కుటుంబ సభ్యులందరితో హాజరు కావాలని గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం అధ్యక్షులు హరీశ్ అన్నబత్తిన్న కోరారు. కుటుంబ సభ్యులందరూ కలిసి రావడం ద్వారా వేడుకలను మరింత వైభవంగా జరుపుకుందాం, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకొందామని సూచించారు.
ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధ్యక్షులు హరీశ్ అన్నబత్తిన్న 484-885-8915 సంప్రదించవచ్చు.
వైస్ ప్రెసిడెంట్ సురేశ్ బొందుగుల, సెక్రెటరీ శివ అనంతుని, ట్రెజరర్ మధు బూదాటి, జాయింట్ సెక్రెటరీ లవ కుమార్ ఐనంపూడి, జాయింట్ ట్రెజరర్ స్వాతి కొండేటి ని సంప్రదించవచ్చు. వీరితో పాటు సభ్యులు విక్రమ్ అర్జుల, శ్రావణి గుత, గౌరీ కర్రోతు, సురేంద్ర కొరిటాల, విజయ భాస్కర్ మక్కెన, ప్రశాంత్ పసుపుల, సుధ విశ్వనాథ్, నిరంజన్ యనమండ్ర, సురేశ్ యలమర్తి ని కూడా సంప్రదించవచ్చు. అలాగే W.W.W.tagdv.com లో కూడా చూడవచ్చు.
కార్యక్రమ వివరాలు
తేదీ : నవంబర్ 14, శనివారం
సమయం : మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ప్రారంభం
వేదిక : UPPER MERION AREA MIDDLE SCHOOL 450 Keebler RD, KING OF PRUSSIA, PA 19406








