టీటీఏ ఇండియానాపొలిస్ బృందం ఆధ్వర్యంలో అక్టోబర్ 11న బతుకమ్మ సంబరాలు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఇండియానాపొలిస్ బృందం ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 2026 న అద్భుతమైన రీతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అమెరికాలో ఘనంగా జరుపుకోవడానికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమ వివరాలు..
తేదీ, సమయం: అక్టోబర్ 11, 2026, మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఈ వేడుక జరగనుంది.
వేదిక: హ్యామిల్టన్ కౌంటీ 4-హెచ్ ఫెయిర్గ్రౌండ్స్, 2003 ప్లెజెంట్ స్ట్రీట్, నోబుల్స్విల్లె, ఐఎన్ 46060.
ఆకర్షణలు..
ఈ కార్యక్రమానికి ప్రవేశం , పార్కింగ్ పూర్తిగా ఉచితం. అలాగే హాజరైన అందరికీ భోజన వసతి కల్పిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పాటలు, ఆటలు, ప్రత్యేక అతిథుల రాక ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
పాల్గొనాలనుకునే వారు పోస్టర్లోని లింక్ ద్వారా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం కవిత రెడ్డి (317-379-4363) ను సంప్రదించవచ్చు. ఈ వేడుకకు సంస్థ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, అధ్యక్షులు/కోశాధికారి సహోదర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ వీరమనేని, జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవిత రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు నాయకత్వం వహిస్తున్నారు.








