కేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో దసరా, దీపావళి సెలెబ్రేషన్స్
కేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (CATS) దసరా, దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లలో నిమగ్నమైవుంది. నవంబర్ 1 వ తేదీన మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకూ ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతాయి.
ఇక.. John Champe High School, 41535 Sacred Mountain St, Aldie, VA 20105 వేదికగా ఈ సెలబ్రేషన్స్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కల్చరల్ రిజిస్ట్రేషన్ కోసం https://tinyurl.com/CATS-Diwali26-Cultural వెబ్ సైట్ ను, వెండార్ రిజిస్ట్రేషన్ కోసం https://tinyurl.com/CATS-Diwali26-Vendors వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
కేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ వారు నిర్వహించే ఈ సెలబ్రేషన్స్ కి ఎంట్రీ ఉచితంగా వుంటుందని, భోజనం కూడా ఫ్రీ అని నిర్వాహకులు ప్రకటించారు. అలాగే సింగర్స్ భరద్వాజ్ కొమరగిరి, యుతి హర్షవర్ధన్, అభినవ్ బండారుపల్లి, వివేక్ పాలెపు, సింధూజ భాగవతుల, శ్రీలత ధూళిపాల, నవీన్ సారగూటమ్, వేదాంత్ కొమరగిరి బృందంతో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వుంటాయి. వీటితో పాటు వెండార్ షాపింగ్, లైవ్ మ్యూజిక్, ప్రైజెస్, ఫ్యాషన్ షో, ఫోటోబూత్, ఫ్యామిలీ, ఫ్రెండ్లీ ఎంటర్ టైన్ మెంట్ కూడా వుంటాయి.
ఇంతటి అపూర్వమైన, అనిర్వచనీయమైన సెలబ్రేషన్స్ కి మన మన కుటుంబాలతో సహా రావాలని కేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ ఆహ్వానిస్తోంది. అందరమూ కలిసి ఈ సెలబ్రేషన్స్ ని కొత్త శోభను చేకూర్చడం ద్వారా, మధురానుభూతులను మనం సంపాదించుకుందాం.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 1, 2026
సమయం : మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు
వేదిక : John Champe High School, 41535 Sacred Mountain St, Aldie, VA 20105
ఇతర ఆకర్షణీయమైనవి :
ఫ్రీ ఎంట్రీ
ఫ్రీ ఫుడ్
కల్చరల్ ప్రోగ్రామ్స్
వెండార్ షాపింగ్
లైవ్ మ్యూజిక్
ప్రైజెస్
ఫ్యాషన్ షో
ఫోటో బూత్








