ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు!
అమెరికాలోని నార్త్ కరోలినా వేదికగా ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్(TTGA) ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించి బతుకమ్మ, దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రవాస గడ్డపై చాటిచెప్పేలా ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా మూడు వేర్వేరు తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
బతుకమ్మ సంబరాల షెడ్యూల్…
ఎంగిలి పూల బతుకమ్మ: అక్టోబర్ 10, 2026 (శనివారం) రోజున సాయంత్రం 4:00 గంటల నుండి క్యారీలోని ఎస్.వి.టెంపుల్ (121 బాలాజీ ప్లేస్, క్యారీ, ఎన్సీ) వేదికగా ప్రారంభం కానుంది.
చిన్న బతుకమ్మ: అక్టోబర్ 14, 2026 (బుధవారం) రోజున సాయంత్రం 4:00 గంటల నుండి క్యారీలోని సాయి టెంపుల్ (1150 ఎస్డబ్ల్యూ మేనార్డ్ రోడ్, క్యారీ, ఎన్సీ) వేదికగా నిర్వహించనున్నారు.
సద్దుల బతుకమ్మ (ముగింపు వేడుకలు): అక్టోబర్ 18, 2026 (ఆదివారం) రోజున ఉదయం 11:00 గంటల నుండి మోరిస్విల్లేలోని సెడార్ ఫోర్క్ డిస్ట్రిక్ట్ పార్క్(228 ఏవియేషన్ పీకేడబ్ల్యూవై, మోరిస్విల్లే, ఎన్సీ) వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుక మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతుంది.
కమ్యూనిటీ భాగస్వామ్యం
సుమారు 3,000 మందికి పైగా హాజరయ్యే ఈ వేడుకల్లో స్థానిక వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు టీటీజీఏ వెల్లడించింది. వ్యాపార స్టాల్స్ ఏర్పాటు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం, ఫ్లయర్స్ పంపిణీ చేయడం, గివ్అవేల ద్వారా స్థానిక కమ్యూనిటీతో అనుసంధానం కావచ్చని తెలిపింది.
సంప్రదింపు వివరాలు
ఈ కార్యక్రమ నిర్వహణలో టీటీజీఏ బోర్డు అధ్యక్షులు శ్రీధర్ అంచురి (ప్రెసిడెంట్ & పీఆర్), వైస్ ప్రెసిడెంట్ & ఫుడ్ రాజేంద్ర అకుతోట, సెక్రటరీ & మెంబర్షిప్ విజయ్ సుమంత్ మైలాపుర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు శ్రీకాంత్ బిజ్జల, జయప్రకాష్ నాన్న, స్వాతి బాసెట్టి, దుర్గ గాండి, అంబిక పిల్లి, ప్రణీత్ కనుకుంట్ల, శ్రీకాంత్ గుప్తా దివ్వెల, అరుణ్ పలరపు తదితరులు ఈ బృందంలో సేవలందిస్తున్నారు. ఈ వేడుకలు, స్పాన్సర్షిప్ వివరాల కోసం శ్రీధర్ అంచురిని 571 246 2398 నంబరులో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.








