రెడ్ గౌన్ లో మరింత అందంగా కనిపిస్తున్న కుమారి
టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్(hebah patel) మరోసారి తన గ్లామరస్ లుక్తో ఆకట్టుకుంది. 2014లో కన్నడ మూవీ అధ్యక్ష(Adhyaksha)తో నటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె, ఆ తర్వాత తమిళంలో తిరుమణం ఎనుమ్ నిక్కా(Thirumanam enum nikka), తెలుగులో అలా ఎలా(Ala ela) సినిమాలతో ప్రేక్షకులకు చేరువైంది. కుమారి 21F(Kumari 21F)తో హెబ్బాకు భారీ సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అవేవీ అమ్మడికి స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే హెబ్బా కెరీర్ తో పాటూ సోషల్ మీడియాకు కూడా సమాన ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అమ్మడు రెడ్ కలర్ ట్యూల్ గౌన్ లో మెరిసిపోయింది. ఈ కాస్ట్యూమ్ కు మంచి వేవీ హెయిర్ స్టైల్ కూడా తోడవ్వడంతో హెబ్బా అందం మరింత రెట్టింపైంది.








