పరుగులు, సైక్లింగ్, ఈత, ఆటలు వంటి యాక్టివ్ వ్యాయామాలు పిల్లల ఎముకలు, కండరాలు బలపడటానికి, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి.
5–17 ఏళ్ల వారికి
స్ట్రెంగ్త్ ట్రైనింగ్, జాగింగ్, HIIT, యోగా వంటి వ్యాయామాలు ఫిట్నెస్ పెంచడంతో పాటు కండరాల బలాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
18–30 ఏళ్ల వారికి
వేగంగా నడక, సైక్లింగ్, వెయిట్ ట్రైనింగ్, స్ట్రెచింగ్ కలిపి చేస్తే గుండె ఆరోగ్యం, మెటాబాలిజం, బరువు నియంత్రణకు మేలు జరుగుతుంది.
30–45 ఏళ్ల వారికి
బ్రిస్క్ వాకింగ్, యోగా, లైట్ స్ట్రెంగ్త్ వ్యాయామాలు, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్లు కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
45–60 ఏళ్ల వారికి
నడక, తేలికపాటి యోగా, బ్యాలెన్స్ వ్యాయామాలు, తక్కువ బరువులతో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే పడిపోవడం ప్రమాదం తగ్గుతుంది.
60 ఏళ్లు పైబడిన వారికి
పెద్దలు వారానికి కనీసం 150–300 నిమిషాల మోస్తరు తీవ్రత వ్యాయామం, అలాగే రెండు రోజులు కండరాల బలం పెంచే వ్యాయామాలు చేయాలని WHO సూచిస్తోంది.
వారానికి ఎంత వ్యాయామం చేయాలి?
వ్యాయామం ప్రారంభించే ముందు 5–10 నిమిషాలు వార్మప్ చేయడం, చివర్లో స్ట్రెచింగ్ చేయడం వల్ల గాయాల ప్రమాదం తగ్గుతుంది.
వ్యాయామానికి ముందు వార్మప్ తప్పనిసరి