టాంటెక్స్ 5కే వాక్/రన్ ..అక్టోబర్ 3న ఫ్రిస్కోలో నిర్వహణ
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 40వ వార్షికోత్సవం , దీపావళి వేడుకల సందడిలో భాగంగా ‘టాంటెక్స్ 5కే వాక్/రన్ 2026’ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 3, శనివారం రోజున ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఫ్రిస్కోలోని షానీ ట్రైల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ వేడుక నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ విశేషాలు ..
ఈ కార్యక్రమంలో 5కే వాక్/రన్‌తో పాటు ఉచిత సీపీఆర్ (CPR) శిక్షణ, బీపీ, బీఎంఐ పరీక్షలు , హార్ట్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. క్లబ్ పిలేట్స్ ఈస్ట్ ఫ్రిస్కో ఆధ్వర్యంలో ప్రత్యేక పిలేట్స్ సెషన్ అలాగే ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నారు. ఈ ఈవెంట్ ద్వారా సమకూరే విరాళాలను ‘ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్’ ప్రతినిధులకు అందజేయనున్నారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్యం, సమాజ సేవ , స్నేహభావాన్ని చాటుదామని, ప్రతి అడుగు ఒక మంచి మార్పుకు దారితీయాలని నిర్వాహకులు కోరారు.








