అమెరికాలో బ్రాహ్మణ కమ్యూనిటీకి వరం ‘ప్రవర వేదిక’ మ్యాట్రిమోని… విశేషాలను పంచుకున్న భానుప్రద దివర్ల
అమెరికాలో ఉన్న తెలుగువారిని ఏకం చేసి ‘మన కోసం మనం’ అనే ఆశయంతో శ్రీమతి భానుప్రద దివర్ల గారు 2015లో ప్రవర వేదికను ప్రారంభించారు. విదేశాలలో స్థిరపడిన మన వారు తమ సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోకుండా ఒకరికొకరు అండగా నిలవాలన్నదే ఈ వేదిక ప్రధాన ఉద్దేశం. బ్రాహ్మణ కమ్యూనిటీ కోసం ఏర్పాటు చేసిన ఈ వేదిక గతేడాది 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా భానుప్రద గారు తెలుగు టైమ్స్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె ఇంటర్వ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి.
సంస్థ ప్రారంభం..
2015లో కేవలం 30 కుటుంబాలతో ఈ సంస్థ స్లోగా మొదలైంది. ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 3000 కుటుంబాలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. 2018లో దీనిని 501(c)(3) లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేశారు. ప్రస్తుతం 15 నుంచి 16 వాట్సాప్ గ్రూపుల ద్వారా సభ్యులు సమాచారాన్ని పంచుకుంటున్నారు. 900 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. సిలికానాంధ్ర, మన బడికి చెందిన నలుగురు వాలంటీర్లు కూడా ఇందులో సేవలు అందిస్తున్నారు. మొత్తం 9 మంది వాలంటీర్లు ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారు.
సేవా కార్యక్రమాలు , సవాళ్లు..
ప్రవర వేదిక ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తోంది. పిల్లలకు కాలేజీ కౌన్సెలింగ్, ఫెడరల్ ఉద్యోగాల కోసం సెమినార్లు నిర్వహిస్తున్నారు. జాబ్ నెట్ వర్కింగ్ లో భాగంగా 600 మందికి పైగా మెంటార్లు ఉద్యోగాలు వెతికే వారికి సాయం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు కడుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో చాలా మందిని ఆదుకుంటున్నారు. కోవిడ్ సమయంలో ఆలయాలు మూతపడినప్పుడు 22 మంది అర్చకులకు 3 నెలల పాటు కనీసం 10 డాలర్ల విరాళాలతో నెలకు 1500 నుంచి 2000 డాలర్ల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈవెంట్స్ నిర్వహించడం, ఫండింగ్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయినప్పటికీ ప్రతి దాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.
తెలుగు సంస్కృతిని, మన అమూల్యమైన ప్రవర వారసత్వ సంపదని భావితరాలకు అందించేందుకు ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. భగవద్గీత, రుద్రం, వేద తరగతులు నిర్వహిస్తున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు వీటి ద్వారా ప్రయోజనం పొందారు. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, విష్ణు, లలితా సహస్రనామ పారాయణాలు, హరికథ, శ్రీ సుందరకాండ, రామాయణ ప్రవచనాలు చేస్తున్నారు. సంధ్యవందనం, సౌందర్యలహరి పారాయణం కోసం మినీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఉగాది, ఆషాఢం, కల్యాణం లాంటి లోకల్ ఈవెంట్స్ ను స్థానికంగా ఘనంగా నిర్వహిస్తారు.
కళ్యాణ వేదిక విశేషాలు…
ప్రవర వేదికకు అనుబంధంగా కళ్యాణ వేదిక 2015లో మొదలయ్యింది. ఉద్యోగావకాశాలను ఆకాంక్షిస్తూ పరదేశాలలో స్థిరపడ్డ ఎన్నారైలు తమ పిల్లలకు తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఇది ఎంతో దోహదపడుతోంది. అమెరికాలో తొలి బ్రాహ్మిన్ మ్యాట్రిమోని ప్లాట్ ఫామ్ ఇదే. ఇందులో రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఫ్రీ. నాన్ బ్రాహ్మిన్స్ రాకుండా ఫిల్టర్ చేస్తారు కాబట్టి సేఫ్టీ, ప్రైవసీ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అమెరికా, యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, అబుధాబి, కువైట్, రియాద్, హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాల నుంచి 2 వేలకు పైగా ప్రొఫైల్స్ ఉన్నాయి. వెబ్ సైట్ లో 3000 మంది రిజిస్టర్ చేసుకోగా, 2200 మంది యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన వారు ఎన్ఆర్ఐలు, లేదా పెళ్లిళ్లు అయినవారు కావచ్చు. ఇప్పటివరకు ఈ వేదిక 3000 మందికి పైగా సహాయపడింది. బ్రాహ్మణ యువత వివాహ సంబంధాల కోసమే పూర్తిగా పని చేసే వేదికే ఇది.
వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
21 నుంచి 39 ఏళ్ల వయసు ఉన్న యువత కోసం కాలిఫోర్నియా, డల్లాస్‌లో మిక్స్ అండ్ మింగిల్, స్పీడ్ డేటింగ్ లాంటి ఈవెంట్స్ చేస్తున్నారు. డల్లాస్ లో పేరెంట్స్ లేకుండా జరిగిన ఈవెంట్ కు 93 మంది వచ్చారు. ఉదయం 9 నుంచి 10:30 వరకు తల్లిదండ్రులకు మీట్ ఉంటుంది. ఈవెంట్స్ కోసం అయ్యే ఖర్చుల నిమిత్తం మాత్రమే టికెట్ కొనాలి. సాయంత్రం 21 నుంచి 39 ఏళ్ల యువత కోసం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అందులో 4 గంటల పాటు పిల్లలు సమయం గడుపుతారు. హెచ్1బీ వీసా పిల్లలకు ఈవినింగ్ సెపరేట్ గా మాట్లాడిస్తాం. గోత్రాలు ఏవైనా ఫర్వాలేదు, కాస్త ఓపెన్ అవ్వండి అని సూచిస్తున్నాం. ఫ్యామిలీ దృష్టిలో పెట్టి సెలెక్ట్ చేస్తారు. ముందుగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారు ఓకే అనుకుంటేనే పేరెంట్స్ ధైర్యంతో పిల్లల నిర్ణయానికి వదిలేస్తారు. పిల్లలనే సెపరేట్‌గా మీట్ అయ్యి వారి అభిప్రాయాలు తెలుసుకునే స్వేచ్ఛ ఇస్తాం. అందుకే ఆ సమయంలో తల్లిదండ్రులకు ప్రవేశం ఉండదు. పిల్లల నిర్ణయాలు స్వేచ్ఛగా ఉండాలనేదే మా అభిమతం.
ఈవెంట్ ఛాలెంజ్…
చాలా మంది లాస్ట్ మినిట్ వరకు వేచి చూసి చివర్లో మేం రావొచ్చా అని రిజిస్టర్ అవుతున్నారు. అలా కాకుండా ముందుగానే మెంటల్ గా రెడీ గా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేసేయండి. 40 ఏళ్ల లోపు వారు ఎవరైనా ఫర్వాలేదు. అయితే ప్రస్తుత కాలంలో యువత 21 నుంచి 30 ఏళ్ల లోపే వివాహం చేసుకోవడం మంచిది. కెరీర్ కూడా చాలా ముఖ్యమే. అమెరికా అయినా, ఇండియా అయినా మగ, ఆడ పిల్లలు ఇరువురు ఉద్యోగం చేస్తేనే సమాజంలో, ఇంట్లో గౌరవం. లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఒకరిపై ఒకరు ఆధారపడటం బాగుండదు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని భానుప్రద గారు సలహా ఇస్తున్నారు.
భవిష్యత్తు ప్రణాళికలు…
రాబోయే రోజుల్లో ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా, సౌత్ ఆఫ్రికా లాంటి 3 దేశాల్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రవర వేదిక 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ మొట్టమొదటి ఫండ్ రైజర్ కార్యక్రమం చేపట్టారు. ఈ సంస్థ చేస్తున్న మంచి పనులకు మద్దతుగా డొనేట్ చేయాలని కోరుతున్నాం. మరింత సమాచారం కోసం https://pravarausa.org లేదా https://pravarausa.org/donate/ వెబ్ సైట్ ను చూడవచ్చు. స్పాన్సర్షిప్స్ కోసం లేదా విరాళాలు ఇవ్వాలనుకునే వారు [email protected] కు జెల్ ద్వారా పంపవచ్చు. ధన్యవాదాలు…








