సెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరాలు.. వాలీబాల్, త్రోబాల్ పోటీలకు అపూర్వ స్పందన
అమెరికాలో తెలుగువారిని కలిపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరీ విభాగం సెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరాలను నిర్వహించింది. క్రీడా స్ఫూర్తిని చాటేలా సాగిన ఈ క్రీడాపోటీలకు తెలుగు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.
ముఖ్యంగా ఈ క్రీడా సంబరాల్లో భాగంగా వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు జరిగాయి. నాలుగు వేరువేరు కేటగిరీలలో జరిగిన ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 34 జట్లు, 275 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఆటలో తమ సత్తాను చాటుతూ చూపించిన క్రీడోత్సాహం ఈ టోర్నమెంట్లు దిగ్విజయం అయ్యేలా చేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్‌ల్లో విజేతలుగా, రన్నరప్‌లుగా నిలిచిన జట్లకు నాట్స్ ఆకర్షణీయమైన ట్రోఫీలతో పాటు నగదు బహుమతులను అందజేసి ఘనంగా సత్కరించింది.
కేవలం స్థానిక ఆటగాళ్లకే పరిమితం కాకుండా, మిస్సోరీ రాష్ట్రంతో పాటు విస్కాన్సిన్, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, కన్సాస్ తదితర నాలుగు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు జట్లు తరలివచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొనడం విశేషం. ఈ క్రీడా సంబరాలు విజయవంతం కావడానికి ప్రచారంలో సహాయం అందించి, తమ జట్టును బరిలోకి దించిన చికాగో, బ్లూమింగ్టన్ చాప్టర్ల నాయకులకు, ముఖ్యంగా వీర తక్కెళ్ళపాటి గారికి నాట్స్ మిస్సోరి విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే చికాగో నుంచి వచ్చి టోర్నమెంట్లో పాల్గొని మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్న చికాగో థండర్‌బోల్ట్స్ విమెన్స్ త్రోబాల్ టీమ్‌ను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది.
గత రెండు నెలలకు పైగా ఎంతో సమన్వయంతో, నిరంతరం శ్రమించి ఈ క్రీడా సంబరాలను విజయవంతం వెనుక కీలక పాత్ర పోషించిన నాట్స్ నార్త్ సెంట్రల్ జోన్ జోనల వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర మరియూ మిస్సోరి చాప్టర్ సభ్యుడు మధు దడ్డాల సేవలను నాట్స్ మిస్సోరి విభాగం నాయకులు ప్రశంసించారు..
ఇవి కూడా చదవండి
నాట్స్ క్రీడా సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన నాట్స్ మిస్సోరి విభాగ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడలు ప్రత్యేకంగా అభినందించారు.
మిస్సోరి చాప్టర్ సభ్యులు మురళి బండారుపల్లి, రాకేష్ రెడ్డి మారుపాటి, అన్వేష్ చాపరాల, చైతన్య పుచ్చకాయల, సునీల్ స్వర్ణ, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, హరీష్ గోగినేని, మధు పాటిబండ్ల, విజయ్ కుమార్ పెనుమత్స, నాట్స్ నార్త్ సెంట్రల్ జోన్ జోనల వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర మరియూ ఇతర వాలంటీర్లు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడంలో కీలక పాత్ర పోషించారు.
నాట్స్ సలహా మండలి గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి అభినందించారు.









