14 నిమిషాల స్పీచ్.. ఆఖర్లో గుర్తొచ్చిన పేరు!
నాని(nani) కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ది ప్యారడైజ్(the paradise). శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దాదాపు 14 నిమిషాల పాటు మాట్లాడిన నాని.. తనతో కలిసి వర్క్ చేసిన నటీనటులు, టెక్నీషియన్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వారి కష్టాన్ని ప్రశంసించారు. అయితే ఈ సుదీర్ఘ ప్రసంగంలో నిర్మాత పేరు మాత్రం అనుకోకుండా మిస్ అయ్యింది.
స్పీచ్ ముగించే సమయంలో నాని మేనేజర్ ఈ విషయాన్ని గుర్తుచేయడంతో వెంటనే రియాక్ట్ అయిన హీరో.. నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) పేరును ప్రస్తావించి తన ప్రసంగాన్ని ముగించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన విషయం కాకపోయినా.. కార్యక్రమంలో ఈ చిన్న సంఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా నాని కెరీర్లో వరుసగా రెండు భారీ సినిమాలను నిర్మించిన నిర్మాత కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో దసరా(Dasara) సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి.. ఇప్పుడు ది ప్యారడైజ్ ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి
ఇక ఈ ఈవెంట్లో నాని సినిమాపై తనకున్న నమ్మకాన్ని, టీమ్ పడిన కష్టాన్ని ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాయదు లోహర్(Kayadhu lohar) హీరోయిన్ గా నటిస్తుండగా, మోహన్ బాబు(mohan babu) కీలక విలన్ పాత్రలో కనిపించనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్(Anirudh) సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ ప్రీ రిలీజ్ బజ్ ఉండటంతో ఓపెనింగ్స్‌పై ఆసక్తి నెలకొంది.








