అక్టోబర్ నెలలో ‘టీటీఏ’ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా వేడుకలు… ఏ తేదీల్లొ అంటే?
అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజల కోసం ‘తెలంగాణ అమెరికా తెలుగు సంఘం’ (TTA) ఆధ్వర్యంలో ‘టీటీఏ నేషన్వైడ్ 2026’ బతుకమ్మ , దసరా సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
వేడుకల షెడ్యూల్..
- అక్టోబర్ 10వ తేదీన అరిజోనా, డల్లాస్, మయామి , టాంపా నగరాలలో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
- అక్టోబర్ 11వ తేదీన న్యూయార్క్, ఇండియానాపొలిస్, న్యూజెర్సీ , షార్లెట్ ప్రాంతాలలో సంబరాలు కొనసాగుతాయి.
- అక్టోబర్ 17 , 24 తేదీలలో అల్బామా, సియాటిల్, లాస్ ఏంజిల్స్, ఫిలడెల్ఫియా అలాగే అట్లాంటా నగరాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి.
నిర్వాహక కమిటీ వివరాలు..
ఈ వేడుకలను అత్యంత విజయవంతం చేయడానికి టీటీఏ కార్యవర్గ కమిటీ , సలహా మండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంఘం అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లెపెద్ది, ప్రెసిడెంట్ ఎలెక్ట్/టెర్రరర్ సహోదర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ వీరమనేని తదితర ప్రముఖులు ఈ కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డి , ఛైర్మన్ డా. విజయ్‌పాల్ రెడ్డి ఈ ఉత్సవాలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.








