కఠ్మాండు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌తో AMVI Software Inc. భాగస్వామ్యం.. వైద్యరంగంలో నూతన అధ్యాయం
అమెరికాకు చెందిన ఏఎమ్వీఐ సాఫ్ట్వేర్ ఇంక్ (AMVI Software Inc.) అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక మెడికల్ ఇమేజింగ్ ప్లాట్‌ఫామ్ AMVIsion తమ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇందులో భాగంగా నేపాల్‌లోని ప్రఖ్యాత కఠ్మాండు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్(KIOCH)తో AMVI ఒక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
ప్రత్యేకతలివే…
ఈ భాగస్వామ్యం ద్వారా వైద్య నిపుణులతో కలిసి ఆసుపత్రిలో AMVIsionను ఉపయోగించి, వారి అనుభవం, సూచనల ఆధారంగా ప్లాట్‌ఫామ్‌ను మరింత అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడనుంది. రోగికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను డాక్టర్లు మరింత సులభంగా చూడటం, అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు ఇతర వైద్య నిపుణులతో కలిసి పరిశీలించడం అనే ఆలోచనతో ఈ వేదిక రూపుదిద్దుకుంది.
AMVIsionలోని అధునాతన DICOM వ్యూయర్, గ్లాస్ పేన్ (Glass Pane), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు రేడియాలజీ ప్రక్రియలో సహజంగా కలిసి పనిచేస్తాయి. X-ray, CT, MRI, మమ్మోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డెంటల్ ఇమేజింగ్‌తో పాటు అనేక రకాల వైద్య చిత్రాలను ఒకే వేదిక ద్వారా నిర్వహించేందుకు దీన్ని రూపొందించారు.
గ్లాస్ పేన్, AI సాంకేతికత…
గ్లాస్ పేన్ విధానం ద్వారా డాక్టర్లు రోగి ప్రస్తుత వైద్య చిత్రాలతో పాటు గతంలో తీసిన చిత్రాలను సులభంగా పరిశీలించి పోల్చగలుగుతారు. దీనివల్ల కాలక్రమంలో రోగి ఆరోగ్యంలో వచ్చిన మార్పులను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏఐ సాంకేతికత వైద్య చిత్రాల పరిశీలనలో వైద్యులకు సాయపడుతుంది. అయితే వైద్యుల స్థానాన్ని భర్తీ చేయడం దీని లక్ష్యం కాదని, రోగికి సంబంధించిన తుది వైద్య నిర్ణయాలు అర్హత కలిగిన వైద్య నిపుణుల చేతుల్లోనే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా AMVI Software Inc.కు చెందిన దేశాయి సిద్ధబత్తుల(Desai Siddabathula – Sid) మాట్లాడుతూ, వైద్యులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నిపుణుల సహకారాన్ని మరింత దగ్గర చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. KIOCHతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో AMVIsion మరింత ముందుకు సాగుతోందని వివరించారు.








